హైదరాబాద్: వెనుకబడిన తరగతుల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల తెలంగాణ శాసనసభ ఆమోదించిన రెండు బిల్లుల పై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరుతూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లేఖ రాశారు.
ప్రధానాంశాలు:
✅ బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం: విద్య, ఉద్యోగ రంగాల్లో & స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు పెంచేందుకు కేంద్ర మద్దతు కోరాలని లక్ష్యం.
✅ అన్ని పార్టీలు ప్రధాని సమావేశానికి ఒప్పందం: శాసనసభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ నాయకులు కలిసి ప్రధానిని కలవాలని సీఎం ప్రతిపాదించగా, అన్ని పార్టీలు అంగీకరించాయి.
✅ కేంద్ర మద్దతు కోసం సీఎం లేఖ: ఈ రెండు బిల్లుల అమలుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని, ఈ విషయంపై ప్రధానితో చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు.
