ప్రణవ్ బాబు సహకారంతో విడుదలైన రూ.4.82 లక్షల నిధులు

వీణవంక, ఆగస్టు 16 (జిందగీ 9 న్యూస్):
మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన సి.డి.పి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సైడ్ కాలువ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అయితే, బిల్లుల మంజూరు విషయంలో ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో గ్రామానికి చెందిన కల్లెపు సదాశివరెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ బాబును కలిసారు.
మామిడాలపల్లి కాంగ్రెస్ నాయకులు కంకణాల జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సమస్య వివరించగా, ప్రణవ్ బాబు సానుకూలంగా స్పందించి పార్టీ భేదాభిప్రాయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ.4,82,881/- నిధులను 13-08-2025 న మంజూరు చేయించేలా చేశారు.
ఈ సందర్భంగా సదాశివరెడ్డి ప్రణవ్ బాబును శాలువా కప్పి సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కటి రఘపాల్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్, కంకణాల జగదీశ్వర్ రెడ్డి, బావు రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
