ప్రయోగం విఫలం – టెక్సాస్ నుంచి నిమిషాల్లోనే పేలుడు
టెక్సాస్: ప్రముఖ వ్యోమనౌకాశ సంస్థ స్పేస్ఎక్స్ నిర్వహించిన భారీ రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగం విఫలమైంది. టెక్సాస్‌లోని బోకా చికా నుండి నిన్న ప్రయోగించిన రాకెట్ కొద్ది నిమిషాల్లోనే నియంత్రణ కోల్పోయి అంతరిక్షంలో పేలిపోయింది.
శకలాలు ఫ్లోరిడా, బహామాస్ ప్రాంతాల్లో పడ్డాయి
పేలిన రాకెట్ శకలాలు దక్షిణ ఫ్లోరిడా, బహామాస్ ప్రాంతాల్లోని ఆకాశంలో తారాజువ్వల్లా ప్రకాశించాయి. అయితే జనావాసాల్లో కూలినప్పటికీ, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.
స్పేస్ఎక్స్కు భారీ ఎదురుదెబ్బ
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్‌షిప్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్. అయితే, ఇది ప్రయోగం అనంతరం కేవలం 15 నిమిషాల్లోనే విఫలమైంది.
దర్యాప్తు చేపట్టిన స్పేస్ఎక్స్
ఈ ఘటనపై స్పేస్ఎక్స్ సంస్థ విస్తృత దర్యాప్తు ప్రారంభించింది. తక్కువ వ్యయంతో మానవులను మంగళగ్రహం వరకు తరలించే లక్ష్యంగా అభివృద్ధి చేసిన స్టార్‌షిప్ ప్రాజెక్ట్‌కు ఇది భారీ ఎదురుదెబ్బగా పరిశీలకులు చెబుతున్నారు. తదుపరి ప్రయోగాల్లో సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
