
పేద కుటుంబానికి అండగా నిలిచిన గాదె ప్రభాకర్ పటేల్
జమ్మికుంట మండలం, గండ్రపల్లి గ్రామం:
సేవా భావంతో ప్రజల అండగా నిలుస్తున్న గండ్రపల్లె సేవ ఫౌండేషన్ అధ్యక్షుడు గాదె ప్రభాకర్ పటేల్ మరోసారి తన సేవా మనసును చాటుకున్నాడు. గ్రామానికి చెందిన కీ.శే. ఓర్సు లింగయ్య అకాల మరణం చెందిన విషయం తెలుసుకున్న అతను వెంటనే గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం మరియు రూ. 2,000 నగదు సహాయం అందించాడు. ఈ సాయాన్ని లింగయ్య భార్య లక్ష్మి, కొడుకు రాజ్‌కుమార్‌కు స్వయంగా అందజేశాడు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామంలో ఏ చిన్నా, పెద్దా కార్యక్రమం జరిగినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రభాకర్ పటేల్‌ను అభినందించారు. అతనికి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ, గ్రామంలోని ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి పేద కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
