పెబ్బేర్: గావ్ చలో – బస్తీ చలో కార్యక్రమంలో భాగంగా పెబ్బేర్ బీజేపీ పట్టణ శాఖ కార్యకర్తలు శనివారం నాడు మున్సిపల్ 11వ వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరియు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మద్దతివ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు పాల్గొని పార్టీ సిద్ధాంతాలు, అభివృద్ధి లక్ష్యాలను ప్రజలకు వివరించారు.
