పెబ్బేరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అవాస్తవమైన, రాజకీయ కక్షసాధింపు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఈ చర్య చేపట్టారు.
ఈ కార్యక్రమంలో పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కారుపాకల వెంకట్ రాములు యాదవ్ నేతృత్వం వహించారు. ఆయనతో పాటు మండల అధ్యక్షుడు & మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎద్దుల విజయ వర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అక్కి శ్రీనివాస్ గౌడ్, మాజీ జిల్లా SC సెల్ అధ్యక్షులు గంధం రాజశేఖర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ సాగర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మోతే రాములు, మాజీ కౌన్సిలర్ ఎల్ల స్వామి పాల్గొన్నారు.
అలాగే మండల SC సెల్ అధ్యక్షులు బాలచందర్, పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు సురేందర్ గౌడ్, తోకల సత్యనారాయణ, యాపర్ల రాంరెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, గుమ్మడం రామిరెడ్డి, దయాకర్ రెడ్డి, షకీల్, జైపాల్ రెడ్డి, ఆశన్న నాయుడు, వెంకటేష్, కాటమోని వెంకటయ్య గౌడ్, గుమ్మడం రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా పెంచికలపాడు జనార్దన్, రంగం నరసింహ, రమేష్, కంచిరావుపల్లి రాము, టైలర్ రాజు, అంజు గౌడ్, బీచుపల్లి గౌడ్, జాంగిర్, వార్డు ఇన్చార్జులు వినయ్, సునీల్, సర్వేశ్, శివ సాయి, యువజన నాయకులు సాయి రెడ్డి, రణధీర్ రెడ్డి, భాను తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేశంలో ప్రజాస్వామ్యం, విపక్ష స్వరాన్ని ఆపే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు.
