అభినందించిన హనుమకొండ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గుగూలోత్ అశోక్ కుమార్
బాలికలు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
హన్మకొండ, జనవరి 28: హనుమకొండ జిల్లా కేంద్రంలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం( జె.ఎన్.ఎస్) లో గత మూడు సంవత్సరాల నుండి క్రికెట్ శిక్షణ తీసుకుంటూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర బాలికల క్రికెట్ అండర్-17 జట్టుకు ఎంపికైన క్రికెట్ క్రీడాకారిణి సహస్రను మంగళవారం హనుమకొండ జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గూగులోత్ అశోక్ కుమార్ అభినందించారు.బాలికలు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కాంక్షించారు.
దండుగల రవిరాజ్ -సుష్మల కూతురైన సహస్ర ఇటీవల ఖమ్మం లో 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.జి.ఎఫ్.ఐ) ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాలికల అండర్-17 క్రికెట్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరఫున ఆడుతూ ఆల్ రౌండర్ గా మంచి ప్రదర్శన కనబరిచి, తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైందని తెలిపారు. ఫిబ్రవరి 2 నుండి హర్యానా రాష్ట్రంలోని పంచకుల లో జరిగే జాతీయస్థాయి బాలికల అండర్ -17 క్రికెట్ పోటీల్లో మెరుగైన ప్రతిభ కనబరిచి జిల్లాకు ,రాష్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లాలోని బాలికల క్రీడలకు ఎనలేని కృషి, ప్రోత్సాహంతో పాటు అన్ని విధాల తోడ్పాటునందించడానికి ఎల్లవేళలా హన్మకొండ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఎల్లవేళల ముందుంటుందని తెలిపారు. తన కోచింగ్ తో బాలురులతో సమానంగా బాలికలకు క్రికెట్ లో శిక్షణ ఇస్తూ వారిని రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి కి అందిస్తున్న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ(డిఎస్.ఏ) క్రికెట్ కోచ్ మహమ్మద్ అఫ్జల్ ను ప్రత్యేకంగా అభినందించారు.
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్.జి.ఎఫ్.ఐ) హన్మకొండ జిల్లా సెక్రెటరీ
దసృ నాయక్, వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి మార్నేని ఉదయభాను రావు, బండారి ప్రభాకర్, మహమ్మద్ అస్లాం, జమ్నస్టిక్ కోచ్ నరేందర్ మరియు పి.టి. ననూగురి రమేష్, లు సహస్ర ను అభినందించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
