
జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్లో నూతన సభ్యుల చేరికలు
జూలూరుపాడు, నవంబర్ 02 (జిందగీ 9 న్యూస్ – వైరా నియోజకవర్గ రిపోర్టర్ రాము నాయక్):జూలూరుపాడు మండల ప్రెస్ క్లబ్లో ఈరోజు నూతన సభ్యుల చేరిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భూరం రమేష్, కంచపోగు నరసింహారావు, తంబర్ల నరసింహారావు, మంద లక్మన్, బందుల ప్రవీణ్ లను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో క్లబ్లో సభ్యులుగా చేర్చుకున్నారు.
క్లబ్ అధ్యక్షుడు వీరూ నాయక్ మాట్లాడుతూ,
“మా ప్రెస్ క్లబ్లో చిన్న, పెద్ద అనే భేదం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులు ఉంటే ఎప్పుడైనా స్వాగతం. జర్నలిజం సేవా దృక్పథంతో సాగాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి బానోత్ రమేష్, ఉపాధ్యక్షుడు దోమలపల్లి గోపి నాయుడు, సహాయక కార్యదర్శి భూక్య రమేష్, కోశాధికారి దారావత్ రాము, గౌరవ సలహాదారులు యాటా సురేందర్, యూసఫ్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
