బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేసిన పి డి ఎ స్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ.విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఆర్ సి ఓ ను సస్పెండ్ చేస్తూ బాధ్యులైన ప్రిన్సిపాల్, వార్డెన్ ను విధుల నుంచి తొలగించాలి చికిత్స పొందుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి అని పి డి ఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు . ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో శర్మ నగర్లోని జ్యోతిబాపూలే గురుకులాల్లో విద్యార్థులు రాత్రి భోజనంలో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు హాస్పటల్లో చేరిన పరిస్థితి నెలకొంది దీనికి కారణమైన కాంట్రాక్టర్లను మరియు ఆర్ సి ఓను సస్పెండ్ చేయాలి నాసిరకమైన ,నాణ్యతలేని కూరగాయలను కాంట్రాక్టర్లు వారి కక్కుర్తి తో విద్యార్థుల జీవితాలతో చెలగటం మడుతున్నారు. కాంట్రాక్టర్లు తక్కువ ధరకు నాసిరకమైన కూరగాయలను వస్తువులను సప్లై చేస్తూ విద్యార్థుల చావులకు కారణమవుతున్నారు. కావున కాంట్రాక్టర్లని వారిపై చర్యలు తీసుకొవాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, శేఖర్, మహేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
