
జమ్మికుంట మున్సిపాలిటీ 30వ వార్డు (UR–జనరల్)లో నలుగురు అభ్యర్థులు బరిలో
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు (UR–జనరల్)లో మున్సిపల్ ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ వార్డుకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా ఎన్నికల బరిలో నిలిచారు.
30వ వార్డులో భారతీయ జనతా పార్టీ (BJP) తరఫున శివకుమార్ బచ్చు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ (INC) నుంచి చందా రాజు నామినేషన్ దాఖలు చేశారు. భారత రాష్ట్ర సమితి (BRS) అభ్యర్థిగా రామడుగు రవీందర్ ఎన్నికల బరిలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా సిలివేరు సత్తమ్మ పోటీ చేస్తున్నారు.
UR–జనరల్ వార్డులో ప్రధాన పార్టీల మధ్య నేరుగా పోటీ నెలకొనడంతో పాటు, స్వతంత్ర అభ్యర్థి కూడా రంగంలో ఉండటంతో ఎన్నికల సమరం ఉత్కంఠగా మారింది. అభివృద్ధి, మౌలిక వసతులు, స్థానిక సమస్యల పరిష్కారమే ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండాగా మారనున్నట్లు స్థానికులు చెబుతున్నారు. 30వ వార్డులో ఎవరి గెలుపు సాధిస్తారన్న దానిపై జమ్మికుంట ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
