జమ్మికుంట మండల వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) లో గురువారం రోజున జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
సదస్సుకు హుజురాబాద్ డిప్యూటీ DMHO డాక్టర్ చందు, మండల విద్యా అధికారి (MEO) హేమలత, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
నులిపురుగుల ప్రభావం – డాక్టర్ చందు వివరణ
ఈ సందర్భంగా డిప్యూటీ DMHO డాక్టర్ చందు మాట్లాడుతూ:
✔ నులిపురుగుల వల్ల పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత, తరచూ కడుపునొప్పి వంటి సమస్యలు వస్తాయి.
✔ శుభ్రమైన ఆహారం తీసుకోవడం, హ్యాండ్ వాష్ టెక్నిక్ పాటించడం అవసరం.
✔ బయట తినే కలుషిత ఆహారం నివారించాలి.
ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
ఫిబ్రవరి 10, సోమవారం రోజున 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు.
1-2 ఏళ్ల పిల్లలకు సగం మాత్ర
3-19 ఏళ్ల పిల్లలకు 400 mg పూర్తి మాత్ర
తప్పిపోయిన పిల్లలకు ఫిబ్రవరి 17న తిరిగి ఇవ్వనున్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్స్ రాజేష్, చందన, హెల్త్ ఎడ్యుకేటర్స్ ప్రతాప్, మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్స్ అరుణ, రత్నకుమారి, కుసుమకుమారి సహా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
