
జమ్మికుంటలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణ – కేసు నమోదు
జమ్మికుంట: పట్టణంలోని కొండూరు కాంప్లెక్స్‌లో వినాయక నిమజ్జనం ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. కొండూరు కాంప్లెక్స్ చెందిన గెల్లు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసుల వివరాల ప్రకారం, సెప్టెంబర్ 5న రాత్రి 11 గంటల సమయంలో ఊరేగింపు జరుగుతుండగా శాలవాడ యువసేన యూత్ క్లబ్‌కు చెందిన శ్యామ్, సందీప్, రాకేష్, హేమంత్లు వచ్చి పాటలు వేయమని కోరారు. అనంతరం వారు డ్యాన్స్ చేస్తూ ఊరేగింపును అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఫిర్యాదుదారుడిని కొట్టి కిందపడేసి తన్నగా, అడ్డం వచ్చిన గౌడ శ్రీనివాసును గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
