బోయినిపల్లి, మార్చి 01 : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బల కొమురయ్య (55) చిట్టి డబ్బులు తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై కరెంటు స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మూడు నెలల క్రితం తన కుల సంఘంలో రూ.30,000 లు తీసుకున్న కొమురయ్య, రెండు నెలలుగా ఆ మొత్తం చెల్లించలేకపోయాడు. శనివారం చిట్టి తేది ఉండడంతో డబ్బులు ఎలా కట్టాలో అనుకుంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఉదయం 6 గంటలకు తన పొలం వద్ద నైలాన్ తాడుతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.ఈ ఘటనపై మృతుడి కుమారుడు పబ్బల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు మండల ఎస్ఐ పృధ్విధర్ గౌడ్ తెలిపారు.
— Zindagi9News
