కరీంనగర్, బుధవారం: అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షుడు వాసవియన్ డైమండ్ స్టార్ ఇరుకుల్ల రామకృష్ణ తన అధికారిక పర్యటనలో భాగంగా బుధవారం కరీంనగర్ వచ్చారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ చేపట్టిన ‘సప్తవర్ణం’ సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, మానసిక వికలాంగులకు ఆర్థిక తోడ్పాటు, వేణుగోపాల స్వామి దేవాలయం (కుదురుపాక)లో నీటి ట్యాంక్ విరాళం, ఉచిత మధుమేహ పరీక్షా శిబిరం వంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగకరంగా నిలిచాయి.
కరీంనగర్ మార్క్ఫెడ్ రాంనగర్ గ్రౌండ్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి రేణికుంట్ల శ్రీనివాస్, జైన అర్చన, జంధ్యం మాధవి, ఎల్లంకి ప్రదీప్, జంధ్యం మధూకర్, పాత రాధాకిషన్, ఆకినపెల్లి నాగరాజు, జిల్లా వేణుగోపాల్, సామ లక్ష్మణ్, ఎలగందుల సౌమ్య, సూర గీత, మాడిశెట్టి ఉమాదేవి తదితరులు హాజరయ్యారు.
స్థానిక ప్రజలు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
