డోన్ పట్టణం, పాతపేటలో ఐ.ప్రభాకర్ గుండెపోటు కారణంగా మరణించడంతో బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి భౌతిక కాయాన్నికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపుతూ మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అదేవిధంగా ధర్మవరం మన్నే చిన్న నాగిరెడ్డి , తెలుగుదేశం యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ కుమార్ రెడ్డి నివాళులు అర్పించారు.
