బోయినిపల్లి ఫిబ్రవరి 25
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలో ఈనెల 27 తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నందున జెడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల చుట్టుపక్కల కూడా 163 సెక్షన్ (144 సెక్షన్) అమల్లో ఉన్నందున ఇద్దరు కంటే ఎక్కువ గుమి కూడి ఉండరాదని, ఎలాంటి గొడవలు చేసుకోకూడదని మరియు ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట సెల్ ఫోన్, అగ్గిపెట్టెలు, లైటర్స్, ఇంకు పెన్నులు, ఇంకు బాటిల్స్ మరియు వాటర్ బాటిల్స్ తీసుకురావద్దని మండల ఎస్.ఐ పృథ్విధర్ గౌడ్ తెలిపారు.
