
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబరు 10వ తేదీ నాటికి తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురించాలంటూ కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
సెప్టెంబరు 6న స్థానాల వారీగా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించనున్నారు. సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 8న జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 9న అభ్యంతరాలు, వినతులు పరిష్కరించి, సెప్టెంబర్ 10న తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ముద్రించనున్నారు.
