
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఏప్రిల్ 22 నుంచి నాలుగు నెలల 14 రోజుల వ్యవధిలో హుండీ ద్వారా రూ.8,59,961/- ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమం దేవాదాయ ధర్మాదాయ శాఖ కరీంనగర్ డివిజన్ పరిశీలకులు పి. సత్యనారాయణ పర్యవేక్షణలో, కార్యనిర్వహణాధికారి కె. సుధాకర్, ఆలయ రీనోవేషన్ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు, సభ్యులు కిషన్ రెడ్డి, నాగరాజు, గోపాల్ రెడ్డి, మల్లేష్ ఆధ్వర్యంలో జరిగింది.
హుండీ లెక్కింపులో ఆలయ అర్చకులు శేషం వంశీధరాచార్యులు, మడికొండ నవీన్ కుమార్ శర్మ, సిబ్బంది మోహన్, మల్లారెడ్డి, సురేందర్ రావు, ప్రవీణ్, రమేష్, రాజేందర్‌తో పాటు శ్రీరామ సేవా సమితి సభ్యులు, అనపూర్ణ ఆర్య వైశ్య సేవా సంస్థాన్ సభ్యులు పాల్గొన్నారు.
