బోయినపల్లి, మార్చి 28: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలో దొంగలు హల్చల్ చేశారు. గ్రామానికి చెందిన సట్టా జలజ (భర్త ఎల్లయ్య,) శుక్రవారం రోజున ఉదయం 9:50 గంటలకు అంగన్వాడి సెంటర్కి కోడిగుడ్లు తీసుకురావడానికి ఇంటికి తాళం వేసి వెళ్లారు.
గంట తర్వాత 10:50 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూడగా, ఇంట్లోని రెండు బీరువాల తాళాలు పగలకొట్టివున్నాయి. బీరువాలో తన ఆభరణాలను తనిఖీ చేసిన జలజ, 5 తులాల 9 గ్రాముల బంగారం, 24 తులాల వెండి కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. దొంగతనానికి సంబంధించిన ఆధారాల కోసం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గ్రామంలో చోరీ ఘటన కలకలం రేపింది.
– Zindagi9News
