
అల్ఫోర్స్ గర్ల్స్ హైస్కూల్లో ఘనంగా స్పోర్ట్స్ మీట్
అల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో అల్ఫోర్స్ గర్ల్స్ హైస్కూల్లో స్పోర్ట్స్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి. నరేందర్ రెడ్డి క్రీడాజ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడానికి పాఠశాల స్థాయి నుంచే ప్రత్యేక శిక్షణా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పట్టు సాధించి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.
ఫుట్‌బాల్, వాలీబాల్, ట్రోబాల్, హ్యాండ్‌బాల్, కబడ్డీ, టెన్నికాయింట్, ఖో-ఖో తదితర క్రీడా పోటీలను ఈ సందర్భంగా నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాబోయే ప్రత్యేక వేడుకల్లో బహుమతులు ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

