
గణతంత్ర దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి టేకుమట్ల మండల కేంద్రంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది ప్రతి దేశ పౌరుడి నోట దేశభక్తి గీతాలపన జాతీయ స్ఫూర్తిని రగిలించాయి. ప్రతి వ్యక్తిలో జాతీయ భావం ఉప్పొంగింది ఆదివారం టేకుమట్ల మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల పరిధిలో 76 వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ పాఠశాలలో మరియు స్థానిక ప్రజాప్రతినిధులు కుల సంఘాల నేతలు పాత్రికేయ మిత్రులు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి జెండా ఆవిష్కరణ పండుగ ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. టేకుమట్ల మండల తహసిల్దార్ విద్యార్థినీ విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎస్సై దాసరి సుధాకర్ ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎస్సై సుధాకర్ మాట్లాడుతూ టేకుమట్ల మండలాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ప్రజాప్రతినిధులను కోరారు.

