హైదరాబాద్‌లో భారీ వర్ష సూచన
కంపెనీలకు సైబరాబాద్ పోలీసుల సూచనలు
హైదరాబాద్, జూలై 22 (Zindagi9News):

రాజధాని హైదరాబాద్‌ను భారీ వర్షాలు తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. స్థానికంగా విస్తారంగా వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ IT మరియు కార్పొరేట్ కంపెనీలకు కీలక సూచనలు జారీ చేసింది. భారీ వర్షాల కారణంగా ఉద్యోగుల రాకపోకలపై ప్రభావం పడే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, “వర్క్ ఫ్రమ్ హోం” విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగుల భద్రత, సేవల నిరంతర కొనసాగింపును సమర్థంగా నిర్వహించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.
పోలీసుల సూచనలు ఇలా:
జూలై 23 న వర్షపాతం ఎక్కువగా ఉండే అవకాశముంది. కనీసం 23 డిగ్రీలు, గరిష్ఠంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మబ్బుల కమ్ము, గాలుల వేగం, తేమ శాతం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ట్రాఫిక్ సమస్యలు, రోడ్డుపై ఆటంకాలను నివారించేందుకు ముందుగానే నిర్ణయాలు తీసుకోవాలని సంస్థలకు సూచించారు.
ముఖ్యంగా మాధాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ హబ్‌లలో గతంలో ఎదురైన ట్రాఫిక్ జామ్‌లను గుర్తు చేశారు.
కంపెనీలు staggered office timingsను అనుసరించాలన్న సూచన కూడా చేశారు.
వాతావరణ మార్పులపై క్రమం తప్పకుండా అప్డేట్స్ను పర్యవేక్షించాల్సిందిగా హెచ్చరించారు.
ఉద్యోగుల పట్ల జాగ్రత్తలు:
అసాధారణ వర్ష పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ఉద్యోగులు అనవసర ప్రయాణాలు నివారించాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానిక పోలీస్ లేదా ప్రభుత్వ అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
సంస్థలకు సూచన:
ఉద్యోగుల రక్షణతోపాటు, సంస్థల పనితీరు నిరంతరంగా కొనసాగేందుకు వర్క్ ఫ్రమ్ హోం విధానం అనుసరించడం సమంజసమని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.
–
