తెలంగాణ సంప్రదాయ-పాశ్చాత్య కళల మేళవింపు మధ్య ఘన ఆరంభం
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం నుండి మిస్ వరల్డ్ 2025 కార్యక్రమం వైభవంగా ప్రారంభమైంది. ఈ అంతర్జాతీయ సౌందర్య పోటీని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి, కళా ప్రదర్శనల మధ్య జరిగిన ఈ వేడుకను “తెలంగాణ గర్వించదగ్గ ఘట్టం”గా అభివర్ణించారు.
ప్రారంభ కార్యక్రమంలో దేశీయంగా తెలంగాణ సంప్రదాయ కళలతో పాటు విదేశీ పోటీదారుల పాశ్చాత్య కళా ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రపంచంలోని 110 దేశాలకు చెందిన సౌందర్య ప్రతినిధులు ర్యాంప్‌పై వైభవంగా ప్రదర్శన ఇచ్చారు. మిస్ ఇండియా నందిని గుప్తా త్రివర్ణ పతాకంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

సైనికుల పట్ల కృతజ్ఞతగా, వారి ధైర్య సాహసాలకు సెల్యూట్‌గా నిర్వాహకులు నివాళులు అర్పించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే లంబాడా కళాకారుల డప్పు beats, నృత్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. ఈ పురాతన కళను “ప్రపంచంలో ఒకటైన సంప్రదాయ నృత్యం”గా నిర్వాహకులు ప్రకటించారు.
కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మిస్ వరల్డ్ 2025 స్పూర్తిదాయక వేదికగా నిలుస్తోందని పలువురు వ్యాఖ్యానించారు.

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
