హరీశ్ రావు బీజేపీలో చేరుతున్నారనే ప్రచారాన్ని ఖండించిన బీఆర్ఎస్

హైదరాబాద్: మాజీ మంత్రి బీజేపీలో చేరబోతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని (బీఆర్ఎస్) ఖండించింది. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పనిగట్టుకొని ఇలాంటి చిల్లర ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ఎవరూ నమ్మవద్దని పార్టీ స్పష్టం చేసింది.
మనందరి లక్ష్యం బీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమేనని, ను తిరిగి ముఖ్యమంత్రిని చేయడమేనని పార్టీ ట్వీట్లో పేర్కొంది.
“జై తెలంగాణ! జై కేసీఆర్!” అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.
ఇటీవల హరీశ్ రావు కేంద్ర మంత్రి తో చర్చలు జరిపారని, 17 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరబోతున్నారంటూ ఓ వాట్సాప్ సందేశం వైరల్గా మారింది.
అయితే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీఆర్ఎస్ స్పష్టం చేస్తూ, పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారని తెలిపింది.
