కరీంనగర్: తెలంగాణ ఉద్యమం నుంచి పాలక స్థానానికి చేరుకున్న ప్రముఖ నేత సర్దార్ రవీందర్ సింగ్ అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజాసేవకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 2014లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా ఎన్నికైన ఆయన, పట్టణ అభివృద్ధికి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
▪️విద్యార్థి దశ నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రవీందర్ సింగ్ 2022లో తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్గా నియమితులై, రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యారు.
అభివృద్ధి ప్రాధాన్యత:
🔹రూ. 1కే నల్లా కనెక్షన్ – కార్పొరేషన్ పరిధిలోని పేద కుటుంబాలకు తక్కువ ఖర్చుతో తాగునీటి సరఫరా.
🔹”అంతిమ యాత్ర – ఆఖరి సఫర్” – మరణానంతర సేవలను కేవలం ఒక్క రూపాయికే అందించే వినూత్న పథకం.
🔹స్వచ్ఛమైన కరీంనగర్ – పట్టణ శుభ్రత, మురుగు నీటి పారుదల వ్యవస్థను మెరుగుపరిచే చర్యలు.
తెలంగాణ ఉద్యమంలో పాత్ర:
◽సర్దార్ రవీందర్ సింగ్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే ఆయన, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రజా మద్దతుతో ముందుకు…
◽ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న రవీందర్ సింగ్, భవిష్యత్తులో మరిన్ని బాధ్యతలు చేపట్టే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
