హైదరాబాద్: నగరంలోని నాగోల్ స్టేడియంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. షటిల్ ఆడుతున్న 25 ఏళ్ల యువకుడు రాకేష్ ఆకస్మికంగా కుప్పకూలిపోయి మరణించాడు.
ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన గుండ్ల రాకేష్ (25) నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే షటిల్ ఆడేందుకు నాగోల్ స్టేడియానికి వెళ్లాడు. ఆటలో పాల్గొంటుండగా ఒక్కసారిగా కింద పడిపోయాడు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.
రాకేష్ తండ్రి గుండ్ల వెంకటేశ్వర్లు తల్లాడ గ్రామ మాజీ ఉపసర్పంచ్గా పనిచేశారు. అర్ధంతరంగా రాకేష్ మృతిచెందడంపై కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
స్థానికులు, స్నేహితులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
