ఇల్లంతకుంట: శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం రోజున ఈ ఓ సుధాకర్ ఆధ్వర్యంలో అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, ఏసిపి శ్రీనివాస్ జీ, రూరల్ సిఐ కిషోర్, ఇల్లందకుంట ఎమ్మార్వో రాణి మరియు ఎస్ఐ రాజ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు అనుసరించాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, తాగునీటి, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తుల భద్రత కోసం పోలీస్ బందోబస్తును పటిష్టం చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు కూడా పాల్గొన్నారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
