శ్రీరామ నవమి సందర్భంగా అంచనూర్లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం
(జిందగీ 9 న్యూస్, ఏప్రిల్ 6 — కామారెడ్డి జిల్లా బ్యూరో)
అంచనూర్ గ్రామంలోని హనుమాన్ గుడి ఆవరణంలో శ్రీశ్రీశ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించబడింది. గ్రామస్థుల మధ్య ఈ వేడుక అంబరాన్ని అంటేలా జరిగింది. సీతారాముల కళ్యాణ దృశ్యం కన్నుల నిండా వైభవంగా మెరిసింది. కమనీయ దృశ్యంగా, భక్తుల మనసులను రంజింపజేసింది.
ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని సందర్శించారు. గ్రామ ప్రజలందరికీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, “సకల జన హితం రామచంద్రుని వారి అభిమతం” అంటూ సంబరంగా ముగిసింది.
కార్యక్రమంలో హనుమాన్ టెంపుల్ అధ్యక్షుడు పడకంటి రవి కుమార్ మాట్లాడుతూ —
“ప్రతి గ్రామంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఒక పవిత్రమైన సందేశాన్ని అందిస్తుంది. సీతారాముల జంట ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ప్రేమగా ఉండే ఆ దంపతుల ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలి” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బెజ్జంకి బాలబ్రహ్మం,
పంతులుగారి రవి,కార్యదర్శులు పంతులుగారి సత్యనారాయణ,కోశాధికారి పంతులుగారి నర్సింలు,అక్కపల్లి భగవాన్ రెడ్డి,సలహాదారులు పందిరి రామ్ రెడ్డి, దోర్నాల లక్ష్మణ్, వంగల శ్రీహరి, దోర్నాల రాజనర్స్, కొమ్ము రమేష్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి వేడుకను విజయవంతం చేశారు.
— Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
