వై శాఖపూర్ : వై శాఖపూర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు. నాలుగో తరగతిలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్ష రెండో దశలో అర్హత సాధించి, విజేతలుగా నిలిచారు.
గురుకుల సీట్లు సాధించిన విజేతలు:
1. సంధ్య పాగా లక్ష్మణ్
2. సంద్య పాగా కురుమూర్తి
3. జక్కుల ఉమాదేవి
4. సంధ్య పాగ దివ్యశ్రీ
5. సూగునూరు గ్రీష్మ
విజేత విద్యార్థులను అభినందిస్తూ కాంగ్రెస్ నాయకుడు కావలి గోవింద్ నాయుడు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ జయరాములు, ప్రధానోపాధ్యాయులు భీముడు మరియు ఉపాధ్యాయ బృందాన్ని కూడా శాలువాలతో సన్మానించి వారి కృషిని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ జక్కుల ఆంజనేయులు, హనుమంతు బలరాం, మన్యం మైబు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
