కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో గత నెల రోజులుగా అనుకోకుండా కొన్ని మరణాలు చోటుచేసుకోవడంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చేతబడి, బాణామతి జరుగుతున్నదంటూ గ్రామాన్ని విడిచి పొలిమేరల్లో గడిపే పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు నేతృత్వంలో గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు మాట్లాడుతూ, “మనిషిని మనిషిలా ఉండనివ్వని మూఢనమ్మకాలు, మూర్ఖతను పెంచుతాయి. అందువల్ల ప్రజలు చైతన్యవంతులై అటువంటి నమ్మకాల నుంచి బయటపడాలి” అని సూచించారు. అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించాలని, మూఢనమ్మకాలపై ఆధారపడకూడదని ప్రజలను చైతన్యవంతులను చేశారు.
వైద్య శిబిరం ఏర్పాటు – ప్రజలకు సూచనలు
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఉచిత మందులు అందజేశారు.
హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, ఏ మోహన్ రెడ్డి వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు:
• రోజుకు 10 గ్లాసుల కన్నా ఎక్కువ నీరు త్రాగాలి.
• బయటకు వెళ్లినప్పుడు గొడుగు, టోపీ, తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి.
• ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో బయట పనులు చేయకుండా ఉదయం లేదా సాయంత్రం చేయాలి.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చందు, ఎంపీడీఓ బీమేష్, జమ్మికుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ వరగంటి రవి, డాక్టర్ రాజేష్, డాక్టర్ హీమబిందు, డాక్టర్ కార్తీక్, హెల్త్ ఎడ్యుకేటర్స్ పంజాల ప్రతాప్ గౌడ్, ఏ మోహన్ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్స్ రత్న కుమారి, సదానందం, పంచాయతీ కార్యదర్శి విష్ణు, ANMs సౌందర్య, హైమావతి, మనోవికాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రొంటాల బుచ్చయ్య, ఆశా కార్యకర్తలు మంజుల, రాజమ్మ, రాజేశ్వరి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం:
🌐 వెబ్సైట్: Zindagi9News.co.in
📢 YouTube: Zindagi9News
📲 Facebook: Zindagi9News
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
