జమ్మికుంట: వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ ఎడ్యుకేటర్ ఎ. మోహన్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా విలాసాగర్ గ్రామంలో వ్యవసాయ, ఉపాధి హామీ కూలీలకు వడదెబ్బ నివారణపై ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “వడదెబ్బ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 10 గ్లాసుల నీరు త్రాగాలి. భయటకు వెళ్లినప్పుడు గొడుగు, టోపీ, తలపాగ ధరించాలి. తెల్లటి, సడలైన కాటన్ దుస్తులు ధరించడం మంచిది. ఎండలేని ఉదయం, సాయంత్రం సమయాల్లోనే పనులు చేసుకోవాలి” అని సూచించారు.
ఎండ వేడిమికి డీహైడ్రేషన్ రాకుండా O.R.S ద్రావణం తాగాలని ప్రజలకు సూచించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు O.R.S పాకెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ రత్న కుమారి, ANM సౌందర్య, మంజుల, ఆశా వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ సుధాకర్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
