రైలుబండి నుండి పడి వ్యక్తి మృతి
జమ్మికుంట: పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ గ్రామానికి చెందిన సంగెం నరేష్ (33) రైలుబండి నుండి కిందపడి మృతి చెందాడు. బిజిగిరి షరీఫ్ దర్గా దర్శనానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో జమ్మికుంట – బిజిగిరి షరీఫ్ స్టేషన్ల మధ్య ఫ్లైఓవర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఫోన్ ఆధారంగా కుటుంబానికి సమాచారం అందించారు. శవాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
