రాష్ట్రస్థాయి ప్రశంస పత్రాన్ని అందుకున్న జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ రాష్ట్రస్థాయి ప్రశంస పత్రాన్ని అందుకున్నారు. సి.డి.ఎం.ఏ. శ్రీదేవి అధ్యక్షతన హైదరాబాద్లోని ఎం.సి.ఆర్. హెచ్.ఆర్.డి. లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.ఈ సందర్భంగా జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తిపన్నుల వసూళ్లలో రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఘనత సాధించిన సందర్భంగా సి.డి.ఎం.ఏ. టి.కె. శ్రీదేవి చేతుల మీదుగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ “Consistent Achiever Award” అందుకున్నారు.కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ, “ఈ పురస్కారం మా మున్సిపల్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, సామాజిక సంఘాల నేతలు, అలాగే జమ్మికుంట ప్రజల అంకితభావం కారణంగా సాధ్యమైంది. అందరి సహకారంతో ఈ విజయాన్ని సాధించగలిగాం. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు,” అని అన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
