
రాజ్యసభ ఎన్నికల నగారా: 10 రాష్ట్రాల్లో 37 స్థానాలకు షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో రెండు స్థానాలకు పోటీ
తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుండటంతో, ఇక్కడ 2 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎంపీలు సురేష్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీల పదవీకాలం ముగియనుండటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయి.
ఎన్నికల కీలక తేదీలు:
ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ముఖ్యాంశాలు ఇవే:
* నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 26, 2026
* నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: మార్చి 05, 2026
* పోలింగ్ తేదీ: మార్చి 16, 2026 (ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు)
* ఓట్ల లెక్కింపు: మార్చి 16, 2026 (సాయంత్రం 5:00 గంటలకు)
ఇతర రాష్ట్రాల్లో ఖాళీలు:
మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వివిధ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 20 లోపు ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తికానుంది.

