జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని దుబ్యాల గ్రామానికి చెందిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగి రవి తండ్రి సంగీ రత్నం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలుసుకున్న జిల్లా సమన్వయ అధికారి,టీ.జీ.డబ్ల్యూ ఆర్.ఎస్ చిట్యాల ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి మృతుడి ఇంటికి వెళ్లి మృతికి గల కారణాలు తెలుసుకొని పరామర్శించారు. అనంతరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి ,ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టిజిడబ్ల్యూ ఆర్ఎస్ ఉపాధ్యాయులు పి. సంజీవయ్య, ఏ.అమర్, పేరెంట్స్ కమిటీ మెంబర్ కన్నూరి రమేష్, దేవేందర్, ఎలక్ట్రిషన్ ఆర్. సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
