
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వైన్స్, బార్లు బంద్
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 11వ తేదీ వరకు వైన్స్ షాపులు, బార్లను మూసివేయాలని ఆదేశించింది.అలాగే, ఎన్నికల ఫలితాల రోజైన ఫిబ్రవరి 13న కూడా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో వైన్స్ షాపులు, బార్లు బంద్‌గా ఉండనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
