హనుమకొండ, మార్చి 03 (Zindagi9 News): గత రెండు సంవత్సరాలుగా మిస్టరీగా మారిన హత్య కేసును ఛేదించి, నిందితులను అరెస్ట్ చేసిన పరకాల ఏసీపీ సతీష్‌బాబు, శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్‌లకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (IPS) నగదు పురస్కారాలను అందజేశారు.
రెండేళ్ల క్రితం పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామ శివారులో ఓ వృద్ధురాలి హత్య జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. పరకాల పోలీస్ స్టేషన్లో పలువురు ఇన్స్పెక్టర్లు మారిపోవడంతో కేసు మిస్టరీగా నిలిచిపోయింది.
వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును శాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్‌కు అప్పగించారు. పరకాల ఏసీపీ సతీష్‌బాబు పర్యవేక్షణలో హత్యకేసు విచారణ చేపట్టిన రంజిత్, కొద్ది రోజులలోనే హత్యకు గురైన మహిళ శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందినవారని గుర్తించారు.
దర్యాప్తులో నిందితుడు ఇంటి రాజిరెడ్డి అని నిర్ధారణ అయ్యింది. బంగారు ఆభరణాల కోసమే రాజిరెడ్డి వృద్ధురాలిని ఇంటి నుంచి తీసుకెళ్లి ధర్మారం గ్రామ శివారులో హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. గత నెలలో పరకాల పోలీసులు రాజిరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
కేసును విజయవంతంగా ఛేదించిన అధికారులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (IPS) అభినందించారు. DCP రవీందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
