జిందగీ9న్యూస్, హనుమకొండ:
హనుమకొండలో ఓ హృదయస్పర్శమైన సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతికి ప్రవేశాలకు అర్హత పరీక్ష నిర్వహణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో, హనుమకొండ జిల్లా పలివేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాల పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి తన తండ్రితో కలిసి చేరుకున్నాడు. అయితే పరీక్షా కేంద్రం వద్దకు రాగానే అతనికి భయం పట్టుకుంది. “నేను లోపలికి పోను, నాకు భయం వేస్తోంది” అంటూ ఆ విద్యార్థి మారం చేయగా, అక్కడే బందోబస్తు నిర్వహణ కోసం వచ్చిన హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి మరియు కేయుసి ఇన్స్పెక్టర్ రవికుమార్ వెంటనే స్పందించారు.
విద్యార్థిని ప్రేమతో బుజ్జగించి, ధైర్యం చెప్పి, పరీక్షా కేంద్రంలోకి పంపించారు. పోలీసుల ఆప్యాయమైన ప్రవర్తన పరీక్ష కేంద్రం వద్ద ఉన్న ఇతర తల్లిదండ్రుల మనస్సులను హత్తుకుంది. ఈ ఘటన పోలీసులపై మరింత గౌరవాన్ని పెంచింది.
హేట్సాఫ్ పోలీస్ అధికారులకు!
