నిరుద్యోగులు, పట్టభద్రుల మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు
– వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ భారీగా డబ్బు వెదజల్లిందని, కేసీఆర్ బీజేపీకి లోపలిగా మద్దతుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసుల భయంతో కేసీఆర్ బీజేపీకి సహకరించారని మండిపడ్డారు.
“బీజేపీ ఎన్నికల్లో కోట్లాది రూపాయలు వెదజల్లింది. బీఆర్ఎస్, బీజేపీ ఒకటై ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర చేశారు. కేసీఆర్ తన కుటుంబ భవిష్యత్తును కాపాడుకోవడానికి బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు,” అని అన్నారు.
నిరుద్యోగులకు మోసం – కేంద్ర ప్రభుత్వ వైఫల్యం
ప్రధాని నరేంద్ర మోదీ గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులకు ఏమి న్యాయం చేశారని నిలదీశారు. “పదేళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు పిట్టకథలు చెబుతోంది” అని విమర్శించారు.
కాంగ్రెస్ అభ్యర్థికి భారీ మద్దతు
కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు, నాయకులు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు.
“కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు నెలల్లోనే 55,000 ఉద్యోగాలను ఇచ్చింది. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇచ్చిన మద్దతుకు ప్రత్యేక కృతజ్ఞతలు,” అని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
