పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్చకుండా తగిన చర్యలు తీసుకోండి
కేంద్రమంత్రి బండి సంజయ్ కు కరీంనగర్ ఆర్యవైశ్య నేతల విజ్ఞప్తి
కరీంనగర్ పట్టణంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్యవైశ్య సంఘం నేతలు, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై తన దృష్టిని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆ పేరు మార్చకుండా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందును బండి సంజయ్ ప్రారంభించారు. అనంతరం, పొట్టి శ్రీరాములు జీవితం, ఆయన త్యాగాల గురించి ప్రసంగిస్తూ, వారి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు కన్న కృష్ణ, మాజీ అధ్యక్షులు బుస్స శ్రీనివాస్, పట్టణ సంఘం అధ్యక్షుడు నగునూరి రాజేందర్, ఉపాధ్యక్షులు కొడిత్యాల సురేష్, సంతోష్, జనరల్ సెక్రటరీ పెద్ది వేణుగోపాల్, కోశాధికారి సుద్దాల వెంకటేష్, యువజన సంఘం అధ్యక్షుడు జీడిగే సాయికృష్ణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు చకిలం స్వప్న, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు రావికంటి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
– Zindagi9News
