ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన మేకల కవిత (D/O సారయ్య) పెళ్లిపై ఒత్తిడితో మే 8న మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను జమ్మికుంట విజయసాయి ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించింది. శుక్రవారం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది. తండ్రి సారయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
