పదేళ్ల నిరీక్షణకు తెర– కేవలం 18 నెలల్లోనే రేషన్ కార్డులు..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ

మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో ఆదివారం నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వొడితల ప్రణవ్ పాల్గొన్నారు. హెలిప్యాడ్ వద్ద మంత్రులకు ప్రణవ్ ఘనంగా స్వాగతం పలికారు.
రాష్ట్ర వ్యాప్తంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని మంత్రి ఉత్తమ్ అన్నారు. పదేళ్లుగా వేచి ఉన్న పేద కుటుంబాలకు కేవలం 18 నెలల్లోనే కార్డులు అందించామన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అంకిత భావానికి నిదర్శనమని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని, సంక్షేమ ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
