
దారుణ హత్య.. తాళ్లతో కట్టేసి పడేసిన మృతదేహం
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి – శంభునిపల్లి గ్రామ శివారులో శుక్రవారం హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేసి, తాళ్లతో కట్టేసి చెట్ల పొదల్లో పడేశారు. స్థానికులు సంఘటనను గమనించడంతో వెంటనే పోలీసులకు సమాచారం చేరింది.అలర్ట్ అయ్యిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు. హత్య ఏ సమయానికి జరిగిందో, ఏ కారణంతో జరిగిందో ఇంకా స్పష్టత లేదు. మృతుడి వివరాలు కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది.ఇంత దారుణంగా హత్య చేసి వదిలివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితుల జాడ కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
