
టీజీఎస్ఆర్టీసీకి కొత్త ఎండీ
హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ కొత్త వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా వై. నాగిరెడ్డి, ఐపీఎస్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్లోని ఎండీ ఛాంబర్లో పూర్వ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
