
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం
జమ్మికుంట, డిసెంబర్ 20:
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న–సదానందం అధ్యక్షత వహించారు. కాటన్ మార్కెట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు.
సమావేశంలో ముందుగా సెప్టెంబర్–2025, అక్టోబర్–2025 మరియు నవంబర్–2025 మాసాలకు సంబంధించిన ఆదాయ–వ్యయాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాల మెరుగుదల లక్ష్యంగా లింకు రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలపై చర్చించారు.
లింకు రోడ్ల అభివృద్ధి ప్రతిపాదనలు:

1. శాయంపేట గ్రామం నుండి బిజిగిరిశరిఫ్ దర్గా వరకు
2. నల్ల శంకర్ రెడ్డి ఇంటి నుండి SRSP వరకు
3. మడిపల్లి గ్రామం నుండి శాంతినగర్ బండారి పాపయ్య భూమి వరకు
4. కోరపల్లి రోడ్డు నుండి సైదాబాద్ గ్రామం వరకు
5. ఎల్లమ్మ గుడి నుండి హనుమాన్ (ఎర్ర బండల) గుడి వరకు
6. నాయినేని శ్రీనివాస్ రావు ఇంటి నుండి ఆబాది జమ్మికుంట శివాలయం వరకు
7. బెతిగల్ గ్రామం నుండి పోతిరెడ్డిపేట గ్రామం వరకు
8. కాపులపల్లి గ్రామం నుండి వల్బాపూర్ గ్రామం వరకు
9. నల్లాలబాయి నుండి లక్ష్మిబాయిపల్లి గ్రామం వరకు
ఈ లింకు రోడ్ల అభివృద్ధికి జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మార్కెట్ నిధుల నుంచి నిధులు మంజూరు చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వారా ప్రభుత్వానికి పంపాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ సమావేశంలో మార్కెట్ కార్యదర్శి ఎన్. రాజా, వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, కమిటీ సభ్యులు రాజేశ్వర రావు, శ్రీనివాస్, సదానందం, సురేష్, దీక్షిత్, శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి, శ్యామ్ కుమార్ పాల్గొన్నారు.
Zero Balance current account
INSTANT DIGITAL
Current account

Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
