జమ్మికుంట మున్సిపాలిటీలో మొత్తం 341 నామినేషన్లు


జమ్మికుంట:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంట మున్సిపాలిటీలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. మూడు రోజుల వ్యవధిలో మొత్తం 30 వార్డుల నుంచి 341 నామినేషన్లు స్వీకరించినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.ఈ నామినేషన్లలో మొత్తం 219 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు వెల్లడించారు. పార్టీల వారీగా చూస్తే భారతీయ జనతా పార్టీ నుంచి 79, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 6, కమ్యూనిస్టు పార్టీ నుంచి 2, కాంగ్రెస్ పార్టీ నుంచి 80, భారత రాష్ట్ర సమితి నుంచి 64 నామినేషన్లు దాఖలయ్యాయి.అలాగే ఇతర రాజకీయ పార్టీల నుంచి 44, స్వతంత్ర అభ్యర్థులుగా 66 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
