
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్గా మొలుగు ప్రశాంత్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ఇండిపెండెంట్ కౌన్సిలర్ మొలుగు(దిలీప్) ప్రశాంత్ కుమార్ను బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బలపరిచి ప్రతిపాదించగా, ఆయనను ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నుకున్నారు.ఎన్నికల ప్రక్రియలో అన్ని పార్టీల కౌన్సిలర్లు హాజరై తమ మద్దతు ప్రకటించారు. దీంతో చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తైంది.అలాగే వైస్ చైర్మన్గా బీఆర్ఎస్ కౌన్సిలర్ ముంతాజ్ అలీ ఏడి మహమ్మద్ (అలియాస్ జావిద్)ను ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద హుజురాబాద్ ఏసిపి మాధవి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.జమ్మికుంట రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.
