జమ్మికుంట: హోలీ పండుగ సందర్భంగా చిన్నకోమటిపల్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ స్కిడ్ అయి చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.
కొత్తపల్లి గ్రామానికి చెందిన మ్యాదరి అనుదీప్ (15) S/o భూమయ్య, జమ్మికుంట కేరళ హైస్కూల్లో తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. హోలీ వేడుకల నిమిత్తం చిన్నకోమటిపల్లికి వెళ్లిన అనంతరం తిరిగి కొత్తపల్లికి వస్తుండగా, చిన్నకోమటిపల్లి శివారులో చెరువు కట్టపై బైక్ అదుపుతప్పి స్కిడ్ అయింది. ఈ ఘటనలో బైక్ చెట్టుకు ఢీకొట్టడంతో అనుదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
తన కుమారుడు ప్రమాదానికి గురై మృతి చెందాడని భూమయ్య స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఆయన ఫిర్యాదు మేరకు ఇల్లందకుంట ఎస్ఐ రాజ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
(మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.)
