టేకుమట్ల: టేకుమట్ల మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొలుగూరి అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా యువజన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ పాణి పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండ శ్రీకాంత్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో యువజన కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు భూపాలపల్లి నియోజకవర్గంలో గ్రామ స్థాయిలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.
అలాగే, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా నిరుద్యోగులను విస్మరించిందని ఆరోపించారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే 50,000 పైచిలుకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేస్తోందని తెలిపారు. యువకులు యువజన కాంగ్రెస్ జెండా కింద పనిచేసి ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో టేకుమట్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, కోశాధికారి శాస్త్రాల కిరణ్, జిల్లా నాయకులు కత్తి సంపత్, తోట గట్టయ్య, కోరే చందు, సంగి రవి, గునిగంటి మహేందర్, సంపత్ రావు, గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి వెంకటేశ్వర్లు, గజ్జి రమేష్, అమ్ము తిరుపతి, బోణగిరి తిరుపతి, వంగ కుమారస్వామి, ప్రభాకర్, కుర్రే మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
