
జమ్మికుంట, మే 19 (జిందగీ 9 న్యూస్): జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న డీకే మార్ట్ సూపర్ మార్కెట్ ఆదివారం రోజున స్థాపితమైన తొలిసంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వార్షికోత్సవ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ప్రణవ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన కేక్ కట్ చేసి, షాపు యజమానులు బూర కరుణాకర్, ధనలక్ష్మిలను అభినందించారు.
ప్రజల మద్దతుతో, నాణ్యమైన సరుకులు తక్కువ ధరలకే అందిస్తూ, డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల సహకారంతో డీకే మార్ట్ ఈ ఏడాదిలోనే జమ్మికుంటలో నంబర్ వన్ సూపర్ మార్కెట్‌గా గుర్తింపు పొందింది. కష్టపడి ఎదుగుతున్న కరుణాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ – “నాతో పాటు నలుగురికి జీవనోపాధి కల్పించాలన్న సంకల్పంతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ రోజు నాకు ఆశీర్వాదంగా నిలిచిన వినియోగదారులకు, వ్యాపార మిత్రులకు, అందరికీ ధన్యవాదాలు,” అని అన్నారు.
ఈ వేడుకలో జమ్మికుంట కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు తోట స్వప్న, పట్టణ అధ్యక్షురాలు పూదరి రేణుక, పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు పరుశరాములు, సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య, గూడెం సారంగపాణి, కూతటి రాజయ్య, పూదరి శివ, సలీం, పెద్ది కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సుమారు 150 మంది వినియోగదారులు, కార్యకర్తలు హాజరై సంబరాల్లో పాల్గొన్నారు.
Today's Best Deals
Affiliate Disclosure: Some links on this page are affiliate links. Zindagi9News may earn a commission from qualifying purchases.
